Home

»

Latest News

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్పరాజ్ హవా!

Feb 22, 2026

 

70వ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల వేడుక శనివారం రాత్రి కొచ్చిలో జరిగింది. 2024 లో విడుదలైన సినిమాలకుగాను అవార్డులు ఇవ్వగా.. తెలుగులో 'పుష్ప-2'(Pushpa 2 The Rule) ఎక్కువ అవార్డులతో సత్తా చాటింది. బెస్ట్ ఫిల్మ్ తో పాటు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్(Allu Arjun), బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్(Sukumar) నిలిచారు. వీరితో పాటు మరికొన్ని అవార్డులు కూడా 'పుష్ప-2' ఖాతాలో చేరాయి. 

'35: చిన్న కథ కాదు' చిత్రానికి గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ అవార్డు అందుకుంది. అలాగే కల్కి, హనుమాన్, కమిటీ కుర్రోళ్ళు, దేవర, గుంటూరు కారం సినిమాలు సత్తా చాటాయి.

 

అవార్డుల జాబితా:

  • ఉత్తమ చిత్రం - పుష్ప 2 
  • ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2)
  • ఉత్తమ దర్శకుడు - సుకుమార్(పుష్ప 2)
  • ఉత్తమ చిత్రం(క్రిటిక్స్) - లక్కీ భాస్కర్
  • ఉత్తమ నటుడు(క్రిటిక్స్) - తేజ సజ్జా (హనుమాన్)
  • ఉత్తమ నటి - నివేదా థామస్(35)
  • ఉత్తమ నటి(క్రిటిక్స్) - కాజల్ అగర్వాల్ (సత్యభామ)
  • ఉత్తమ సహాయ నటుడు - అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
  • ఉత్తమ సహాయ నటి - అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
  • బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ - పుష్ప 2 
  • ఉత్తమ గీత రచయిత - రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే సాంగ్, దేవర)
  • ఉత్తమ గాయకుడు - శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి సాంగ్, గుంటూరు కారం)
  • ఉత్తమ గాయని - శిల్పారావు  (చుట్టమల్లే సాంగ్, దేవర)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
  • బెస్ట్ డెబ్యూ యాక్టర్ - సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్ళు)
  • బెస్ట్ డెబ్యూ హీరోయిన్ - నయన్ సారిక (గం గం గణేశా)
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - నితిన్ జిహాని(కల్కి 2898 AD), రామకృష్ణ-మోనిక(పుష్ప 2)
  • బెస్ట్ కొరియోగ్రఫీ - శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి సాంగ్, గుంటూరు కారం)
g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com