Home

»

gossip

‘వారణాసి’కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది!

Feb 20, 2026

సూపర్‌స్టార్ మహేష్(Superstar Mahesh babu), ఎస్.ఎస్.రాజమౌళి(S.S.Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబ్ ట్రాటింగ్ ఎడ్వంచరస్ మూవీ ‘వారణాసి’(Varanasi). ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్ప్పుడు వస్తున్న అప్‌డేట్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచుతున్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనగానే సహజంగానే ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే సినిమాకి అన్ని హంగులు కల్పించడానికి రాజమౌళి కషి చేస్తున్నారు. 

 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారనే వార్త వినిపిస్తోంది. నాని హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంలో విలన్‌గా సుదీప్ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. నటుడిగా అతన్ని ఎక్కడికో తీసుకెళ్లిందా సినిమా. ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రంలో ఒక సీన్ చేశారు. 

 

ఇప్ప్పుడు ‘వారణాసి’ చిత్రంలో సుదీప్ కోసం రాజమౌళి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారని తెలుస్తోంది. సినిమాలో 30 నిమిషాల పాటు సుదీప్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. కథను మలుపు తిప్పే కీలక పాత్ర అతనిదని చెబుతున్నారు. ఒక తెలుగు సినిమాలా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చే సినిమాగా ‘వారణాసి’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పథ్విరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప్పుడు సుదీప్ కూడా ఈ సినిమాలో భాగం కానుండడంతో మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది. 

 

1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు.  గతంలో రాజమౌళి చేసిన కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి నిర్మాణం జరుపుకున్నాయి. దానికి భిన్నంగా ‘వారణాసి’ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com