Home

»

Latest News

The wedding of Virosh: ఉదయ్‌పూర్ బయల్దేరిన విజయ్, రష్మిక

Feb 23, 2026 10:38AM

ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్
పెళ్లిని అధికారికంగా ప్రకటించిన విజయ్, రష్మిక
ఉదయ్‌పూర్ కు పయనం

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) పెళ్ళి గురించి కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ లో వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని విజయ్, రష్మిక అధికారికంగా ప్రకటించారు.

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో విజయ్, రష్మిక కలిసి నటించారు. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. గతేడాది నుంచి ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. 

ఆ న్యూస్ ని నిజం చేస్తూ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం గతేడాది అక్టోబర్ లో జరిగింది. వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో జరగనుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ విషయాలు ముందే బయటకు వచ్చేశాయి. 

ఇక ఎట్టకేలకు విజయ్-రష్మిక తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. ఈ జోడీని అభిమానులు ముద్దుగా విరోష్(VIROSH) అని పిలుస్తుంటారు. అందుకే తమ పెళ్ళికి 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్'(The wedding of Virosh) అని పేరు పెట్టినట్లు తెలుపుతూ.. ఇద్దరూ ఒకే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు.

తాజాగా విజయ్, రష్మిక తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్ కు పయనమయ్యారు. ఎయిర్ పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో విజయ్, రష్మిక ఒకే తరహా అవుట్ ఫిట్ తో కనిపించడం విశేషం.

కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందట. ఆ తర్వాత హైదరాబాద్ లో జరగనున్న రిసెప్షన్ కి అందరినీ పిలవనున్నారని తెలుస్తోంది.

Also Read: అదుర్స్-2 చేయడానికి ఎన్టీఆర్ రెడీనా?

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com