థర్టీ ఇయర్స్ పృథ్వీ నిజ జీవితంలో విలనా..?
on Jun 29, 2017

"థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ" అంటూ ఖడ్గం సినిమాలో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్‌తో టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసి.. ఆ డైలాగ్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి తన మార్క్ పంచ్‌లతో ప్రేక్షకులకు కితకితలు పెడుతున్నాడు. ఏ సినిమా వచ్చినా అందులో పృథ్వీ ఉండాల్సిందే. ఈ మధ్యలో హీరోగా మీలో ఎవరు కోటీశ్వరుడు చేశాడు..ఆ సినిమా ఊహించినంత విజయం సాధించనప్పటికీ మనోడి కామెడీ టైమింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ విధంగా సినిమాల్లో మనకి వినోదాన్ని పంచుతున్న పృథ్వీ నిజ జీవితంలో అంత మంచి వాడు కాదు అంటూ ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. అదేంటి..అంటే..వాళ్లు బోలెడు రీజన్స్ చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితం పృథ్వీ ఆఫీసులో పనిచేసే రిసెప్షన్ అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి..ఇప్పుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ వార్త టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పడు తాజాగా అతని భార్యతో గొడవల విషయం బయటకు వచ్చింది. తన భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆయన భార్య శ్రీలక్ష్మీ గృహ హింస కేసు పెట్టింది. గత జనవరి నుంచి ఈ కేసును విచారిస్తున్న విజయవాడ ఫ్యామిలీ కోర్టు నిన్న తుది తీర్పును వెలువరించింది. భార్యతో విడిగా ఉంటున్నందున ఆమెకు నెలకు రూ.8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించడంతో పృథ్వీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



