బయోపిక్ నుంచి తప్పుకున్న తేజ.. కొత్త దర్శకుడు ఇతనే...!
on Apr 26, 2018

నటసింహ నందమూరి బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు నెల రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అంతా సక్రమంగా జరుగుతున్న సమయంలో తేజ తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బాలకృష్ణ కథ, నటీ, నటుల ఎంపిక విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం తేజ కి అస్సలు నచ్చ లేదట. కొన్ని రోజులు చూసి ఇక చివరికి, తాను ఈ సినిమా చేయలేనని బయటకి వచ్చేసాడట. మరి, ఇంతకీ ఎన్టీఆర్ బయోపిక్ కి ఎవరు దర్శకత్వం వహించనున్నారు? వెటరన్ దర్శకుడు రాఘవేంద్ర రావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, బాలకృష్ణ కి దర్శకత్వ బాధ్యతలు వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదట. తాను ఇష్టపడి రాసుకున్న కథకి తాను అయితేనే న్యాయం చేయగలనని నమ్ముతున్నాడట. అందుకే, ఎన్టీఆర్ బయోపిక్ ని స్వతహాగా బాలకృష్ణే దర్శకత్వం వహించే అవకాశం ఉంది అంటున్నారు. అందుకు, నిర్మాతలు కూడా సమ్మతంగా ఉన్నట్లు తెలుస్తుంది. అన్నీ సక్రమంగా జరిగితే, ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, ఎవరు తీసినా, ఈ సినిమాని దసరా కల్లా విడుదల చేయడం కాస్త కష్టతరం గా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



