శ్రీరెడ్డి బుట్టలో పడ్డ బడా హీరో ఎవరు?
on Apr 11, 2018
.jpg)
శ్రీరెడ్డి సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆమె ధాటికి చిత్రసీమలోని బడా బాబులకు, వాళ్ల బాబులకు కూడా కలవరం వచ్చేస్తోంది. రోజుకో పేరు బయటకు తీసి... షేక్ చేసి పారేస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఆమె బయటకు తీసిన పేర్లు కొన్నేనట. పెద్ద చేపలు ఇంకా చాలా ఉన్నాయని సమాచారం. ఈ టోటల్ వ్యవహారంలో ఓ బడా హీరో అడ్డంగా బుక్కయిపోయాడని తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఓ పెద్ద హీరోకొంతకాలం శ్రీరెడ్డితో సన్నిహితంగా మెలిగాడట. అందుకు సంబంధించిన వీడియోలు కొన్ని శ్రీరెడ్డి దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఫినిషింగ్ టచ్‌గా ఆ వీడియోని విడుదల చేయాలని శ్రీరెడ్డి భావిస్తోంది. శ్రీరెడ్డి ఖాతాలో కొంతమంది నిర్మాతల తనయులు, ఇప్పుడిప్పుడే దర్శకులుగా నిలదొక్కుకుంటున్నవాళ్లు ఉన్నార్ట. వాళ్ల రాసలీలలకు సంబంధించి శ్రీరెడ్డి దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని, అవి వీలు చూసుకుని పక్కాగా బయటపెట్టాలని భావిస్తోందని టాక్. అయితే ఈలోగా శ్రీరెడ్డితో సంబంధాలు ఉన్న కొంతమంది.. బేరాలకు దిగారట. `మా గురించి మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలి` అంటూ రేటు ఫిక్స్ చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే శ్రీరెడ్డి దృష్టంతా ఆ పెద్ద చేపపై ఉందని, ఆ పేరు బయటపెట్టి పరిశ్రమనంతటినీ ఉలిక్కిపాటుకు గురిచేయాలని భావిస్తోందని టాక్. మరి శ్రీరెడ్డి వలలో చిక్కుకున్న ఆ బడా హీరో ఎవరో, ఆ పేరు ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



