రాముడిగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా..?
on May 19, 2017

500 కోట్లతో భారతదేశంలో ఇంతవరకు ఎవరు నిర్మించనంత భారీగా రామాయణాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. మూడు భాగాలుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని 3డీ ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తామని చెప్పారు అరవింద్. అంతా బాగానే ఉంది కానీ అల్లువారి రామాయణంలో సీతారాముల పాత్రలు ఎవరు పోషిస్తారు..మిగతా క్యారెక్టర్ల సంగతేంటి అంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో రాముడి పాత్ర చేయించనున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఆ వార్త ఇలా వచ్చిందో లేదో కొందరు మెగా అభిమానులు రామ్‌చరణ్‌కి రాముడి వేషం వేయించి ఓ పోస్టర్ వదిలారు. ఇదంతా పక్కన బెడితే రాముడి పాత్రకు రామ్‌చరణ్ సెట్ అవుతాడా లేదా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. రాముడంటే ఆజానుబాహుడు కదా మరి చెర్రీయేమో మిడియమ్ హైట్ .. ఇంతకు ముందెప్పుడు పౌరాణికాలు చేసిన అనుభవం లేదు. మగధీరలో కాలబైరవ పాత్ర ఒక్కటే చెర్రీకి కలిసివచ్చే అంశం. ఏది ఏమైనా అసలు చరణ్‌ని రాముడిగా అనుకున్నారా లేదా అన్నది తేలాల్సిన విషయం. ముందు ఆ సంగతి తేలితే ఎంత చర్చ నడిచినా అర్థముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



