టాప్ హీరోయిన్ మతం మార్చుకుందా..!
on May 21, 2017

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకతను చాటుకొని..తన ప్రేమను పదిల పరుచుకొని..త్వరలో శ్రీమతి గా మారబోతున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తిరుమల దర్శనం చేసుకొని తన మొక్కు తీర్చుకుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. అంతేకాదు ఆమె తన మతాన్ని మార్చుకుందని గుసగుస వినిపిస్తుంది. ఈ ప్రచారం జోరందుకుంది. నాగ చైతన్య తో ప్రేమలో పడిన సమంత...నిశ్చితార్థం జరుపుకొని పెళ్ళికి సిద్దమైంది. త్వరలో వీరిద్దరూ ఒకటవబోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని హిందూ ఆచారాలను అలవాటు చేసుకుంటుందని చెప్పుకుంటున్నారు.
.jpg)
గతం లో కూడా ఆమె పూజా కార్యక్రామలలో పాల్గొనడంతో మతం మారిందని భాహాటంగా ప్రచారం జరిగింది. దానిపై నాగ చైతన్య అలాంటిదేమీ లేదని..ఎవరి నమ్మకాలు వారివని ..గౌరవించుకోవాలని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంపై ఎంత వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఎవరైనా కుటింబీకులు స్పందిస్తేగాని ఈ ప్రచారం ఆగేలా లేదు. ఎవరు స్పందిస్తారో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మతాల మార్పు మనసైన ప్రేమకు అడ్డం కాదన్నది నిజం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



