ఛీ వాళ్లు తల్లిదండ్రులు కాదు..డబ్బు తప్ప నేనక్కర్లేదు
on May 18, 2017
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది
. సినిమా చూపిస్తా మావ, ఎక్కడకు పోతావు చిన్నవాడా వంటి హిట్ సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఏ సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం అవికా సినిమాల నుంచి తప్పుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయిందట. దీనికి కారణం ఎవరో కాదు స్వయంగా అవికా తల్లిదండ్రులు.
చిన్ననాటి నుంచీ మంచి ఫేమ్‌లో ఉండటంతో సీరియళ్లు, ఎండార్స్మెంట్ల ద్వారా బాగానే కూడబెట్టింది అవికా. ఆ సంపాదనంతా ఆమె తల్లిదండ్రులు ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టేవారట. ఏమైనా అంటే నువ్వు చిన్న పిల్లవి అనేవారట. నిజమే ఉయ్యాల జంపాల సినిమా నాటికి ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇప్పుడు అవికా మేజర్ కావడంతో సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చింది. అందుకే ఇన్నాళ్లు తనను మనీ మెషిన్లా చూసిన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి ఒంటరిగా ఉంటోందట. అవికా సినిమాలకు దూరం కావడానికి మరో రీజన్..ఒక తెలుగు హీరో అసభ్య ప్రవర్తనేనట. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన ఆనంది ఏకంగా ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చేసిందట.