బాబోయ్ సమంతాది బయటపడింది..!
on Jul 14, 2016
హెడ్డింగు చూసి "బాబోయ్ సమంత ఏం చేసేసింది?" అని కంగారుపడకుండా కొంచెం నిదానంగా చదవండి. అందరు పిల్లల్లా సమంత కూడా స్కూల్ టైమ్ లో చక్కగా చదువుకొనేది. సమంత మాట్లాడేప్పుడు "ఈ అమ్మాయి ఎంత తెలివిగా మాట్లాడుతుంది" అని అనుకోకమానరు. అయితే.. సమంతకు ఈ తెలివి సినిమాల్లోకి రాకముందునుంచీ ఉందండోయ్. ఈ విషయాన్ని స్వయంగా సమంతా తన ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేసింది.
అమ్మడికి టెన్త్ క్లాస్ లో 88% మార్కులు వచ్చాయి. ముఖ్యంగా మ్యాథ్స్ లో అయితే ఏకంగా వందకి వంద మార్కులు వచ్చాయి. ఇవాళ సరదాగా ఇంట్లో సామాన్లు సర్దుతుండగా.. ఈ పాత రిపోర్ట్ కార్డ్ దొరికిందట. ఆ రిపోర్ట్ లోని రిజల్ట్స్ చూసి సమంత తల్లి సంతోషపడగా.. సమంత మాత్రం "నాకిన్ని మార్కులు వచ్చాయా?" అనుకొంటూ ఆశ్చర్యపోయిందట. బహుశా సమంతలోని ఈ క్వాలిటీ నచ్చే నాగచైతన్య ఈమె వెనకపడి మరీ పెళ్ళికి ఒప్పించాడేమో!