శ్రీదేవి.. 'కోటి'కి పెట్టింది టెండర్!
on Sep 10, 2015
.jpg)
ఈ ఇన్నింగ్స్‌లో వీలైనంత సంపాదించాలని శ్రీదేవి డిసైడ్ అయిపోయినట్టుంది. అందుకే పారితోషికం విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. తమిళ చిత్రం పులికి ఏకంగా రూ.6 కోట్లు పారితోషికం అందుకొంది. బాహుబలి సినిమాకీ ఇంతే డిమాండ్ చేయడంతో జక్కన్న బృందం శ్రీదేవిని పక్కన పెట్టింది. అయినా సరే.. శ్రీదేవిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇప్పుడు డబ్బింగ్ కోసమే ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందని టాలీవుడ్ టాక్. పులిని తెలుగులో ఎస్వీఆర్ మీడియా డబ్ చేస్తోంది. శ్రీదేవి పాత్రకు శ్రీదేవితోనే డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని నిర్మాతలు భావించారు. అయితే.. అందుకు శ్రీదేవి ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసి సదరు నిర్మాతకు చమటలు పట్టించిందట. కేవలం 20 నిమిషాలుండే పాత్రకు కోటి రూపాయలు ఇవ్వడం ఎందుకు దండగా అని చెప్పి.. నిర్మాతలూ లైట్ తీసుకొన్నారట. ఇలా పారితోషికాల పేరుతో శ్రీదేవి ఎందుకు భయపెడుతుందో మరి, కాస్తయినా రిబేటు ఇవ్వొచ్చుగా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



