సమంతకు దిమ్మదిరిగే.. దిమ్మాతిరిగే...
on Sep 10, 2015
.jpg)
ఇది వరకటిలా... బడా ఆఫర్లను పట్టుకోవడంలో సమంత ఫెయిల్ అయిపోతోంది. సమంత కెరీర్ దాదాపుగా ఫినిష్ అనుకొంటున్న తరుణంలో త్రివిక్రమ్ సమంతకు ఓ ఛాన్సిచ్చి ఆదుకొన్నాడు. నితిన్ సినిమాలో సమంత ఇప్పుడు కథానాయికగా పిక్సయ్యింది. అయితే... తన కెరీర్ పట్ల సమంత ఏమాత్రం సంతృప్తిగా లేనట్టు టాక్. బడా హీరోలు, దర్శకులతో ఇది వరకటిలా జోరుమీద సినిమాలు చేయాలని స్కెచ్ వేస్తోంది.
అందుకే.. ఇప్పుడు దర్శకుల్ని.. 'మీ సినిమాలో ఛాన్సివ్వరా?' అంటూ మాటవరుసకు అడుగుగున్నట్టు అడిగి.. వాళ్ల అభిప్రాయాన్ని తెలుసుకొంటోందట. ఇటీవల రాజమౌళి ఈగ 2 తీయబోతున్నారన్న వార్తలొచ్చిన నేపథ్యంలో సమంత రాజమౌళి దగ్గరా ఇదే ప్రశ్న వేసిందట. ''ఈగ లో నటించా కదా, ఈగ 2లోనూ చాన్స్ ఇస్తారా'' అని అడిగేసిందట.
అయితే రాజమౌళి మాత్రం దిమ్మతిరిగే రీతిలో సమాధానం ఇచ్చాడట. ''ఈగ 2 ఎప్పుడు తీస్తానో చెప్పలేను. మరో నాలుగేళ్లు పట్టొచ్చు. అప్పటికి నువ్వుంటావా'' అంటూ ఓ సెటైర్‌వేశాడట. దాంతో సమంత మైండ్ బ్లాంక్ అయిపోయిందట. రాజమౌళి సరదాగా అన్నాడా, లేదంటే.. 'నీ పనైపోయింది' అని చెప్పకనే చెప్పాడా అనే విషయం అర్థం కాక సమంత.. జుత్తు పీక్కొంటుందట. పాపం. బ్యాడ్ టైమ్ అంటే ఇలానే ఉంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



