'రుద్రమదేవి'ని చూసే మోక్షం ఎప్పుడూ?
on Aug 21, 2015
.jpg)
గుణశేఖర్ తెరకెక్కించిన భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవికి ఆటంకాలు ఇంకా తప్పినట్లు కనబడడం లేదు. గత కొన్ని నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఓ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోగలిగింది. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
బాహుబలి, శ్రీమంతుడు తరువాత తెలుగు సినిమా మార్కెట్ బాగా పుంజుకోవడంతో 'రుద్రమదేవి'కి మంచి రోజులొచ్చాయని, సెప్టెంబర్ 4 విడుదల కానున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖయామని అందరూ భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయినట్టు లేటెస్ట్ టాక్.
సిజి వర్క్ ఇంకా పెండింగ్ లో వుండడ౦తో ఈ సినిమాను అక్టోబర్ 2న దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ డేట్ క్యాష్ చేసుకోవాలని మంచు విష్ణు, నాని పోటీ పడుతున్నారట. ఒకవేళ రుద్రమదేవి వస్తే ఆగాలని, లేకుంటే రావాలని డిసైడ్ అయ్యరాట. మరి తెలుగు ప్రేక్షకులకు రుద్రమదేవిని చూసే మోక్షం ఎప్పుడూ కలుగుతుందో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



