మెగా ఫ్యాన్స్ కి షాకిచ్చిన చిరు
on Aug 19, 2015
.jpg)
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా 150వ సినిమా ఓపెనింగ్ జరుగుతుందని ఆశించిన అభిమానులకు మెగా షాకిచ్చాడు చిరు. ఓ ఇంటర్వ్యూ లో 150వ గురించిన విశేషాలు బయటపెట్టాడు . ‘‘నా 150వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేద్దామని అనుకున్నాం. అతను చెప్పిన ఫస్టాఫ్ నచ్చింది. కానీ సెకండాఫ్ విషయంలో పూర్తి సంతృప్తి కలగలేదు. దాన్ని డెవలప్ చేయమని చెప్పాం. ఇంతలోనే పూరి వేరే సినిమాతో బిజీ అయిపోయాడు. నా 150వ సినిమా విషయంలో తొందర పడాలని అనుకోవట్లేదు. రెండు మూడు నెలలు ఆలస్యమైనా ఇబ్బందేమీ లేదు. అందుకే కొంచెం వెయిట్ చేయాలనుకుంటున్నాం. నా పక్కన హీరోయిన్ గా ఎవరిని పెట్టుకోవాలన్నదానిపై చాలామంది సలహాలిస్తున్నారు. అనుష్క అంటున్నారు, తమన్నా అంటున్నారు. ఇంకా ఏవేవో పేర్లు చెబుతున్నారు. ఐతే నా వయసుని, ఇమేజ్ ని, అభిమానుల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ ను ఎంపిక చేస్తాం’’ అని చిరు అన్నాడు. మరోవైపు చిరు బర్త్ డే వేదికపై ఈ సినిమాకి సంబంధించిన ఇంకేమైన విశేషాల్ని అన్నయ్య చెబుతారనే అభిమానులు ఆశిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



