మెగా పార్టీకి పవర్ స్టార్..కానీ ఓ ట్విస్ట్..!!
on Aug 21, 2015
.jpg)
మెగాస్టార్ గ్రాండ్ 60ఇయర్స్ బర్త్ డే పార్టీకి ఏర్పాట్లు పాస్ట్ గా జరిగిపోతున్నాయి. శిల్పకళా వేదికలో ఇందుకోసం తగిన ఎర్పాట్లు చేస్తున్నారు. బర్త్ డే పార్టీకి వచ్చే ఫ్యాన్స్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలతో ఏర్పాట్లను ప్లాన్ చేస్తున్నారు. పార్క్ హయాత్ లో జరగనున్న గ్రాండ్ పార్టీకి రాబోతున్న ప్రముఖలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఎందరో వస్తున్నట్లు సమాచారం. అంతా బాగానే వుంది. కానీ మెగాస్టార్ కోసం పవర్ స్టార్ వస్తాడా? లేక ఏదైనా సాకు చెప్పి దూరంగా వుంటాడా అన్నదే మెగా ఫ్యాన్స్ లో జరుగుతున్న ముఖ్యచర్చ.
మెగా క్యాంప్ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ అన్నయ్య షష్టిపూర్తి వేడుకలకు వస్తాడని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ తో జరిగే వేడుకకు మాత్రం మిస్ అవుతాడట. దాని కోసం అన్నయ్యకు బర్త్‌డే విషెస్ అందించిన వీడియో క్లిప్ పంపే ఏర్పాటు చేస్తున్నాడట.పార్క్ హయాత్ లో జరిగే ఫ్యామిలీ ఫంక్షన్ కు మాత్రం పవన్ హాజరవుతాడట. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది వస్తుండడంతో పవన్ కూడా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో మెగా కాంపౌండ్ ఫుల్ ఖుషి ఖుషీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



