రామ్‌చరణ్ హీరోయిన్.. ఓ దెయ్యమా??
on Nov 10, 2014

తమిళనాట అప్పుడప్పుడు షాక్‌కి గురి చేసే కథలొస్తున్నాయ్. పిజ్జా లాంటి సినిమాలు చేయడానికి పెద్ద హీరోలు సైతం ముందుకొస్తున్నారు. తమిళనాట సూపర్ హీరోగా చలామణీ అవుతున్న సూర్య ఇప్పుడో హారర్ సినిమా చేస్తున్నాడు. అదే 'మాస్'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఇదో దెయ్యం కథ. ఆ పాత్ర కోసం అమీ జాక్సన్‌ని ఎంపిక చేసుకొన్నారు. రామ్‌చరణ్ సినిమా 'ఎవడు'లో ఓ కథానాయికగా నటించింది అమీ. ఇప్పుడు శంకర్ సినిమా 'ఐ' చేస్తోంది. దెయ్యం పాత్రకు అమీ అయితే సరిగ్గా సరిపోతుందని టీమ్ భావిస్తోందట. అమీని స్కీన్ టెస్ట్ కూడా చేశారు. ఆమెపై కొన్ని సీన్స్ ట్రైట్ షూట్ పేరుతో తెరకెక్కించారు. అమీ నటన పట్ల చిత్రబృందం పూర్తి సంతృప్తితో ఉందట. అందుకే దెయ్యం పాత్ర ఆమెకు దక్కిందట. ఇప్పటి వరకూ బికినీలతో, చిట్టి పొట్టి దుస్తులతో మెరిసిన అమీ... దెయ్యం పాత్రలో ఎలా రాణిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



