'సింహం' రూట్ మార్చి౦ది..!
on Nov 11, 2014
.jpg)
మాస్ సినిమాలతో తెలుగు సినిమా అభిమానులను అలరించే నందమూరి బాలయ్య తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. తన 99వ చిత్రంతో బాలయ్య కుర్ర హీరోలకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఈ సినిమా క్యారెక్టర్ కోసం బాలకృష్ణ పదిహేను కేజీల బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన డైట్, నిపుణుల పర్యవేక్షణలో ఎక్సరసైజ్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ‘లౌక్యం’ టీమ్ కోన వెంకట్, గోపీమోహన్, డైరెక్టర్ శ్రీవాస్ చెప్పిన కథను ఓకే చేసిన బాలయ్య ఈ ప్రాజెక్ట్ కోసం బాగా కష్టపడుతున్నారట. తన రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. బాలకృష్ణ ఏజ్‌కి తగ్గట్టు డిగ్నిఫైడ్‌గా ఉండే క్యారెక్టరే అయినా కానీ కామెడీకి లోటు ఉండదట. నందమూరి అభిమానులైతే వందవ చిత్రం మొదలయ్యే ముందుగా బాలయ్యకి కరెక్ట్ ప్రాజెక్ట్ సెట్ అయిందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



