'బహద్దూర్'గా రామ్‌చరణ్??
on Nov 9, 2014
రీమేక్ సినిమాలపై మోజు అంతకంతకూ పెరుగుతోంది. సినిమా నచ్చితే చాలు, భాషతో సంబంధం లేకుండా రీమేక్ చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు మెగాహీరోల దృష్టి 'బహద్దూర్' అనే కన్నడ చిత్రంపై పడింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి మాస్ మసాలా సినిమాగా పేరు తెచ్చుకొంది. ఈ సినిమా రైట్స్‌కోసం గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్ పోటీ పడుతున్నార్ట. ఈ సినిమాని రామ్‌చరణ్‌తో తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నారాయన. గోవిందుడు అందరివాడేలే తరవాత చరణ్ సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. బహద్దూర్ లైన్‌తో కథ చేయమని దర్శకులకు చరణ్ సూచించే అవకాశం ఉంది. ఒక వేళ చరణ్ వరుస సినిమాలతో బిజీ అయిపోతే, ఈ సినిమాని అల్లు అర్జున్ తో అయినా రీమేక్ చేయిస్తారని చెప్పుకొంటున్నారు. మొత్తానికి ఓ మెగా హీరోతో ఈ సినిమా తెరకెక్కించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



