పెదనాన్నతో ప్రభాస్‌కి ఇబ్బందే!
on Dec 4, 2015
.jpg)
ప్రభాస్‌కి పెదనాన్న కృష్ణంరాజు అంటే చాలా చాలా గౌరవం. నా ఉన్నతికి కారణం పెదనాన్నే అని చాలా సందర్భాల్లోచెప్పాడు కూడా. కృష్ణంరాజు కూడా ప్రభాస్ స్టార్ డమ్‌నీ, తాను సాధిస్తున్న విజయాల్ని చూసి పొంగిపోతుంటారు. అయితే ఆ పెదనాన్నే ప్రభాస్ కి ఇబ్బంది కలిగిస్తున్నారు.. పెదనాన్నకు అవునని, కాదని చెప్పలేక ప్రబాస్ కూడా.. తెగ ఇదైపోతున్నాడు.కారణం ఏంటంటే.. పెదనాన్న కృష్ణం రాజుకి ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని కోరిక. నిర్మాతగా కాదు, దర్శకుడిగా. అందుకోసం కథల్ని కూడా రెడీ చేసుకొన్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభాస్ కి పెదనాన్నతో సినిమా చేసేంత తీరిక లేకుండా పోయింది. బాహుబలి 2 తరవాత ఒప్పుకొన్న కమిట్‌మెంట్స్ చాలా ఉన్నాయి. పైగా పెదనాన్నది ఎంతకాదన్నా ఓల్డ్ స్కూల్. ఈతరం అభిరుచులకు తగినట్టుగా సినిమా తీయకపోవచ్చు. ప్రభాస్ ఎదిగే తరుణమిది. ఈ దశలో రిస్క్ తీసుకోవడం ప్రభాస్‌కీ ఇష్టం లేదు. కానీ...పెదనాన్న అడిగితే కాదనలేడు. ఈమధ్య పిల్మ్ చాంబర్‌లో దందా అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు ప్రభాస్. అంతకు ముందు ఒక్క అడుగు అనే టైటిల్ కూడా ప్రభాస్ కోసమే నమోదు చేయించారు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్ తో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే బాహుబలి తో వచ్చిన ఇమేజ్‌ని పాడుచేసుకోవడం ప్రభాస్ కి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని పెదనాన్నతో చెప్పలేక మింగలేక తెగ ఇదైపోతున్నాడని తెలుస్తోంది. నిర్మాతగా అయితే కృష్ణంరాజు ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి ప్రభాస్ రెడీనే. దర్శకత్వమే డౌటు పడుతున్నాడు. ఈ ఇబ్బందిని కృష్ణంరాజు కూడా అర్థం చేసుకొంటే మంచిదని రెబల్ స్టార్ అభిమానుల అభిప్రాయం. మరి ఆయన మనసులో ఏముందో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



