చిరంజీవి అంటే ఎగిరిపడుతున్నాడట!!
on Dec 4, 2015
.jpg)
ముకుంద, కంచె సినిమాతో క్లాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ, లోఫర్‌తో నెక్స్‌ట్ లెవల్‌కి వెళ్లిపోవాలని చూస్తున్నాడట. దర్శకుడు పూరీకి మాస్ లో మంచి ఫాలోయింగ్ వుండడంతో, ఈ సినిమాతో తన మార్కెట్ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నాడట. పెద్దనాన్న సమక్షంలో లోఫర్ ఆడియో గ్రాండ్ గా రిలీజ్ చేస్తే మెగా అభిమానుల సపోర్ట్ కూడా ఈ సినిమాకి దక్కుతుందని భావించాడట. అయితే వరుణ్ ఆశలకు సడన్ గా బ్రేక్ వేశాడు పూరీ జగన్నాధ్.
150వ సినిమా విషయంలో తనకు ఓ మాట కూడా చెప్పకుండా పబ్లిగ్గా కామెంట్ చేసిన చిరుపై పూరీకి ఇంకా కోపం తగ్గలేదట. చిరంజీవి గారిని పిలిస్తే తాను ఆడియోకి రానని నిర్మాతతో తేల్చి చెప్పాడట. దీంతో పూరీ మాటను వరుణ్ కి చెప్పాడట నిర్మాత. పూరీ స్టార్ డైరెక్టర్ కావడంతో వరుణ్ తేజ్ కూడా అడ్డు చెప్పలేకపోయాడట. మొత్తానికి మెగా హీరోల సపోర్ట్ లేకుండా 'లోఫర్' ఫంక్షన్ జరపబోతున్నాడు పూరీ!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



