అల్లరోడు దార్లోకొచ్చాడా??
on Dec 3, 2015
.jpg)
అల్లరి నరేష్ అంటే మస్త్ కామెడీ! నరేష్ సినిమాలకు వెళ్లి జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సరే, కానీ అల్లరోడితో సినిమా తీసి నిర్మాతలు నెత్తీ నోరూ కొట్టుకొంటుంటారు. కారణం.. నరేష్ సెట్ కి వచ్చే టైమింగ్ అలాంటిది. తొమ్మిదింటికి షాట్ అంటే తీరిగ్గా 12 గంటలకు వస్తాడట. అసలు నరేష్ నిద్రలేచేదే పదింటికని టాలీవుడ్ కోడై కూస్తుంటుంది. ఆలస్యంగా షూటింగ్‌కి వస్తా.. అలాగైతేనే ఎగ్రిమెంట్ చేసుకోండి అంటాడట.. నరేష్. దానికి ఒప్పుకొన్న వాళ్లే.. నరేష్ తో సినిమాలు తీస్తుంటారు.
అయితే ఇప్పుడు మోహన్ బాబు కాంపౌండ్‌లో మామ మంచు అల్లుడు కంచు అనే సినిమా చేశాడు నరేష్. మోహన్ బాబు సినిమా అంటే ఉదయం ఏడింటికల్లా ఫస్ట్ షాట్ తీసేయాల్సిందే. నరేషా... 11 గంటలకు గానీ రాడు. మరి ఈ ఇద్దరికీ ఎలా సెట్టవుతుందయ్యా అనుకొన్నారంతా. కానీ నరేష్ మాత్రం ఏడింటికే లొకేషన్‌కి వచ్చేసేవాడట. సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం నరేష్ ఈ టైమింగ్ పాటించాడని, మోహన్ బాబు దెబ్బతో నరేష్ దార్లోకి వచ్చేశాడని చెప్పుకొంటున్నారంతా.
నరేష్ ఆఫర్ ఈ సినిమాకేనా, లేదంటే మిగిలిన సినిమాలకు కూడా ఇస్తాడా అన్నది చూడాలి. నరేష్ కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్‌లో ఉంది. ఇలాంటప్పుడుడైనా టైమింగ్ పాటిస్తే మంచిది. అందుకే నరేష్‌లో ఈ మార్పు వచ్చిందని చెప్తున్నారు సినీ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



