పవన్ త్రివిక్రమ్ లు హ్యాట్రిక్ కొడతారా?
on Sep 11, 2015
.jpg)
పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయబోతున్నారు. పవర్ స్టార్ అభిమానులకు అమితానందం కలిగించే ఈ వార్త...ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. జల్సా సినిమాతో పవన్ కు హిట్టిచ్చిన త్రివిక్రమ్... ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంతో టాలీవుడ్ లో కొత్త లెక్కలు సెట్ చేశారు. ఇప్పుడు మూడోసారి జతకట్టి...హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్, మరో సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నందున,అవి కంప్లీట్ కాగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే గతంలో ప్రకటించినట్లుగా‘కోబలి‘ చిత్రం ఉండదని, అత్తారింటికి దారేదిలాగా ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనరే ఉంటుందని తెలుస్తోంది. మరి ముచ్చటగా మూడోసారి జతకట్టబోతున్న పవన్-త్రివిక్రమ్ లు...టాలీవుడ్ లో మళ్లీ కొత్త లెక్కలు సెట్ చేసి...హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



