తమిళ్ మూవీలో రామ్ చరణ్ ..!!
on Sep 11, 2015
.jpg)
తమిళ్ లో ఘన విజయం సాధించిన చిత్రం 'తని వరువన్'. తమిళనాట కలెక్షన్ల వర్షం కురిపిస్తోందీ సినిమా. ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. కారణం.. మహేష్ బాబు, రామ్‌చరణ్ లు ఈ చిత్రాన్ని రిమేక్ చేయడానికి ఆసక్తి చూపడం. అయితే, ఈ సినిమా చరణ్ ఖాతాలోకె వెళ్ళే చాన్స్ ఎక్కువని వినిపించింది. ఇప్పుడు అదే జరిగింది. ఈ సినిమా చరణ్ కు ఓకే అయిపోయింది. నిర్మాత దానయ్య ఈ సినిమా రిమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రిమేక్ హక్కులు ఎడిటర్ మోహన్ దగ్గర వున్న సంగతి తెలిసిందే. ఆయనేమో చిరుకు సన్నిహితుడు. రీమేక్ పై చరణ్ చాలా ఆసక్తి చూపడం, చిరు ఓ మాట చెప్పడం, దానయ్య నిర్మతగా సినిమా చరణ్ ఖాతాలోకి వెళ్ళడం జరిగిపోయిందని వినికిడి. అన్నీ కుదిరితే ‘బ్రూస్‌లీ’ తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



