త్రిషతో మళ్లీ స్టార్ట్ చేశాడా?
on Sep 12, 2015
.jpg)
త్రిషకూ, రూమర్లకూ కావల్సినంత అవినాభావ సంబంధం ఉంది. త్రిష సినీ కెరీర్ అంతా గాసిప్పుల చుట్టూనే తిరిగింది. వరుణ్‌తో నిశితార్థం చేసుకొన్న తరవాత.. వాటికి పుల్ స్టాప్ పడుతుందనుకొన్నారు. అయితే ఆ నిశ్చితార్థం రద్దు అవ్వడంతో త్రిష మళ్లీ రూమర్లలో నలుగుతోంది. త్రిష - రానా మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. వరుణ్ నిశ్చితార్థం వల్ల... ఆ వార్తలకు కామా పడింది.
ఇప్పుడు వరుణ్ కి త్రిష తూచ్ చెప్పేయడంతో ఈ వార్తలకు మళ్లీ ఊపిరి వచ్చింది. త్రిష మళ్లీ రానాతో ప్రేమాయణం మొదలెట్టిందని, వీళ్లిద్దరూ ఇప్పుడు నిత్యం టచ్‌లో ఉంటున్నారని టాలీవుడ్ టాక్. ఇటీవల నాయకి ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన త్రిష... రానాని కలుసుకొందని, రానా త్రిషకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. దాంతో మళ్లీ త్రిష, రానాల మధ్య లవ్ ఎఫైర్ మొదలైపోయిందని, వీళ్లిద్దరూ పాత ప్రేమాయణంలో కొత్త చాప్టర్లు రాస్తున్నారన్న లవ్ లీ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు త్రిష ఏమంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



