కష్టం కాంపౌండ్ లో పవన్ ఫ్రెండ్
on May 13, 2014
.jpg)
ఆ పేరు పెద్ద హిట్... ఆయన స్టైల్స్ సూపర్ హిట్.. ఆయన మాట అయినా, బాట అయినా అభిమానులకు ఎంతో గురి... అలాంటి పవన్ తో సినిమా అంటే వెనక్కి తిరిగి ఆలోచించే అవసరమే లేదు. ఇదే నమ్మకం తో ఆయనతో భారీ చిత్రాలు నిర్మించడానికి తెలుగు పరిశ్రమలో పెద్ద నిర్మాతలు ముందుకు వస్తుంటారు. కాని ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయిందంటూ టాలీవుడ్ లో టాక్ వినపడుతోంది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న భారీ చిత్రం గబ్బర్ సింగ్ 2. ఈ సినిమా నిర్మాణ పనులు ముందుకు సాగక పోవడంతో మూవీ నిర్మాతగా ఉన్న పవన్ స్నేహితుడు శరత్ మరార్, నష్టాలలో ఉన్నాడని టాలీవుడ్ బోగట్టా. సురేష్ ప్రొడక్షన్స్ అండ్ శరత్ మరార్ జాయింట్ వెంచర్ గా తెరకెక్కుతున్న గబ్బర్ సింగ్2 చిత్రం కోసం శరత్ కొంత మొత్తాన్ని అప్పుగా తెచ్చుకోవడం, అది కాస్తా ఖాళి అయిపోతు ఉండటం, సినిమా ఎంతకీ మొదలు కాకపోవడంతో అయన నానా ఇబ్బందులు పడుతున్నారని అనుకుంటున్నారు. నమ్మిన వాళ్లకు వంద శాతం విజయాన్ని ముట్ట జెప్పే గబ్బర్ సింగ్ స్నేహితుడికి జరిగే నష్టాన్ని ఎలా తగ్గిస్తాడో.. వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



