ఆయన వస్తే మనం వెనక్కేనెమో!!
on May 12, 2014
.jpg)
అక్కినేని ఇంటి మూడు తరాలు కలిసి ముచ్చటగా నటించిన మనం సినిమా విడుదల మరో సారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. విడుదలకు ఎప్పటి నుంచో సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని సరైన సమయం కోసం ఆపి ఉంచారు. పరీక్షలు, ఎన్నికలు, ఫలితాలు లాంటి అంశాలు అంచనా వేసి మే 23 న చిత్రాన్నివిడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశారు. అయితే ఈ రోజున రజనీకాంత్ చిత్రం విక్రమసింహా కూడా విడుదల కాబోతుందని వార్తా వెలువడటంతో, మనం చిత్ర యూనిట్ ఆలోచనల్లో పడింది. విక్రమసింహా చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్న నేపథ్యంలో మనం చిత్ర విడుదల వాయిదా వేయటం గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికి పలు మార్లు విక్రమసింహ చిత్రం విడుదల తేదీ మారుతూ వచ్చింది. ఈ సారి కూడా తేది మారినా ఆశ్చర్యం లేదు. మరోవైపు రెండు చిత్రాలు విడుదల అయిన ఏ చిత్రం కలెక్షన్లు ఆ చిత్రానికే ఉండే అవకాశం ఉంది. ఇలా పలు అభిప్రాయాలు నెలకొని ఉండటంతో మనం విడుదల పై అక్కినేని కుటుంబం ఆలోచనలో పడింది. అక్కినేని చివరిసారిగా కనిపించనున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఆడియో, ట్రైలర్స్ కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



