హన్సిక మళ్ళీ ప్రేమలో పడిందా
on May 14, 2014
.jpg)
శింభుకి ప్రేమ వీడ్కోలు పలికిన హాన్సిక కొత్తగా మళ్లీ ప్రేమలో పడిందనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సిద్దార్థతో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య సమంతను కలిసిన హన్సిక షాకింగ్ సంగతులు ఎన్నో ముచ్చటించిందట. తన లైఫ్ లో ఊహించని సంఘటనలు ఎన్నో జరిగాయి అని 15 ఏళ్లకే నటిగా మారుతానని తాను అనుకోలేదని, ప్రస్తుతం కోలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదగడం తన ధ్యేయమని చెప్పింది హన్సిక. కెరీర్ సంగతితో పాటు పర్సనల్ విషయాలు పంచుకుంది ఈ హసీనా. సమయం వస్తే తనకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకుంటానని అంటోంది హన్సిక. ఇక సిద్దార్థతో ప్రేమ విషయంపై హన్సిక స్పందిస్తూ ప్రస్తుతం తనకు సినిమాలే జీవితం అని, సిద్దార్థ తనకు మంచి మిత్రుడు మాత్రమే అని సర్వ సాధారణ జవాబు ఇచ్చింది. ఈ మాటలు చెవిన పడితే సమంత షాక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు అక్కడివారు. ఇది ఇలా ఉంచితే శిoభు పై ఉన్న కోపంతోనే హన్సిక ఇలాంటి కామెంట్ చేసిందేమో అని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే సిద్దూ పై హాన్సిక మనసు పడితే సమంత ఏం చేస్తుందో..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



