బాలయ్య ‘పైసా వసూల్’కి డ్రగ్ ఎఫెక్ట్?
on Jul 14, 2017

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’. ‘సెప్టెంబర్ 29న సినిమాను విడుదల చేస్తాం’ అని సినిమా ప్రారంభం రోజునే ప్రకటించేశాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. కానీ... ప్రస్తుతం జరిగిన ఊహించని పరిణామం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేలా చేసింది. డ్రగ్స్ రాకెట్ లో దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండంతో బాలయ్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన తమ అభిమాన హీరో బాలకృష్ణ.. తన 101 చిత్రం తెరకెక్కించే బాధ్యతను మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన పూరీ జగన్నాథ్ కు అప్పజెప్పి చాలా తప్పు చేశారని పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ బాధ్యను నిర్వహిస్తున్న నటి చార్మీ పేరు కూడా ఈ డ్రగ్స్ రాకెట్ లో ఉన్న విషయం తెలిసిందే. మరి అనుకున్నట్లు ‘పైసా వసూల్’సెప్టెంబర్ 29న విడుదల అవుతుందా?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



