బాలయ్యతో పెట్టుకోకపోవడానికి కారణం అదే..?
on Jul 15, 2017
.jpg)
ఒకప్పుడు పవర్‌ఫుల్ పోలీస్ రోల్స్‌తో టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపి యాంగ్రీ యంగ్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్. అయితే కొత్తహీరోల ఏంట్రీతో అవకాశాలు తగ్గిపోవడంతో అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ అవేవి చెప్పుకోదగ్గ విజయాలు అందించలేదు. అయితే రాజశేఖర్ తోటి హీరోల్లో చాలా మంది విలన్లుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడంతో ఆయన కూడా వాటిపై ఫోకస్ పెట్టి తన ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించనున్న సినిమాలో రాజశేఖర్ ప్రతినాయకుడిగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆఫర్ శ్రీకాంత్‌ని వరించింది..విలన్ పాత్ర హీరోకు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని..పారితోషికం కూడా కాస్త ఎక్కువగా ఉండాలనే షరతులు పెట్టడంతో రాజశేఖర్‌కు నో చెప్పారట..ఏమైనా ఇంతకాలం హీరోగా నటించిన ఆయనకు విలన్ వేషాలు వేయాలంటే కాస్త గిల్టీగానే ఉంటుంది మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



