డ్రగ్స్ రాకెట్లో ఇరుక్కున ‘ఆ తండ్రీకొడుకులకు’ మంత్రిగారి అభయం?
on Jul 14, 2017

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ గొడవ నేపథ్యంలో రకరకాల ఆసక్తి కరమైన విషయాలు బయట పడుతున్నాయి. ప్రస్తుతం పోలీసుల ద్వారా తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖుల పేర్లతో మీడియా బిజీ బిజీగా ఉంది. అయితే... ఈ వినిపిస్తున్న పేర్లే కాకుండా... ఇంకొందరు పేర్లు కూడా ఈ రాకెట్ లో ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. సినీ పరిశ్రమను శాసించే కుంటుంబాల్లోని ఓ కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు కూడా ఈ డ్రగ్ రాకెట్ లో ఉన్నారట. తండ్రి ప్రముఖ నిర్మాతట. కొడుకు లీడింగ్ హీరో అట. వీరిద్దరూ పేర్లు కూడా డ్రగ్స్ రాకెట్ లో ఉండటంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ మంత్రిగారు వీరికి బాసటగా నిలిచినట్లు తెలుస్తుంది. వీరి పేర్లు బయటకు రాకపోవడానికి ఆ మంత్రిగారే కారణమట. ఇంతకీ ఆ తండ్రీ కొడుకులు ఎవరో మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



