'NTR31'కి నారా రోహిత్ మూవీ టైటిల్!
on Jun 3, 2022
'ఆర్ఆర్ఆర్' విజయోత్సాహంతో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి రెండు సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాల టైటిల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా 'NTR31' టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
'NTR31'కి 'అసుర' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. అయితే గతంలో ఇదే టైటిల్ తో నారా రోహిత్ సినిమా చేయడం విశేషం. 2015 లో నారా రోహిత్ హీరోగా నటించిన అసుర మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇప్పుడు 'NTR31'కి 'అసుర' టైటిలే కరెక్ట్ అని భావించిన మూవీ టీమ్ ఆ టైటిల్ కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి రోహిత్ కి కలిసిరాని ఈ టైటిల్ తారక్ కలిసొస్తుందో లేదో చూడాలి.
తారక్-కొరటాల కాంబో మూవీ వచ్చే నెల పట్టాలెక్కనుంది. ఆ సినిమా పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు తారక్. మరోవైపు ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' మూవీ చేస్తున్న ప్రశాంత్ ఈ ఏడాది చివరి కల్లా దానిని పూర్తి చేసి.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో 'NTR31'ని పట్టాలెక్కించనున్నాడు.