మహేశ్ తో ప్రియాంక రొమాన్స్!?
on Jun 4, 2022

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన `డాక్టర్`, `డాన్` చిత్రాలతో తమిళనాట సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది `గ్యాంగ్ లీడర్` బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. కట్ చేస్తే.. త్వరలో ఈ హోమ్లీ సుందరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రొమాన్స్ చేయనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ మహేశ్ బాబుతో ఓ చిత్రం నిర్మించనున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మహేశ్ సరసన ఇద్దరు నాయికలు సందడి చేయనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా ఇప్పటికే `బుట్టబొమ్మ` పూజా హెగ్డే ఎంపికైంది. మరో హీరోయిన్ గా శ్రీలీలని సెలెక్ట్ చేశారని ఆ మధ్య ప్రచారం సాగినా.. అధికారిక ప్రకటన రాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఆ సెకండ్ లీడ్ రోల్ కి ప్రియాంక అరుళ్ మోహన్ ని ఫిక్స్ చేశారట. పాత్ర నిడివి తక్కువే అయినా ఎంతో ప్రాధాన్యం ఉండడంతో ప్రియాంక వెంటనే ఓకే చెప్పేసిందని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ లో ప్రియాంక అరుళ్ మోహన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



