నాగార్జున ఔట్.. 'బిగ్ బాస్-6' హోస్ట్ గా సమంత!
on Jun 3, 2022
తెలుగులో బిగ్ బాస్ షో ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్ కి రెడీ అవుతోంది. మొదటి రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆరో సీజన్ కి నాగార్జున ప్లేస్ లో సమంత రానుందంటూ ప్రచారం జరుగుతోంది.
నాగార్జునకి సమంత మాజీ కోడలు అన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె ఇటీవల విడాకులు తీసుకుంది. అయితే చైతన్యతో విడాకులు తీసుకోకముందు నాగ్ మామ అంటూ నాగార్జునతో ఎంతో ఆప్యాయంగా ఉండేది. ఆ సమయంలో సినిమా షూటింగ్ తో నాగార్జున బిజీగా ఉంటే 'బిగ్ బాస్-4' లో స్పెషల్ హోస్ట్ గా కూడా సమంత దర్శనమిచ్చింది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్-6 కి పూర్తిస్థాయి హోస్ట్ గా వ్యవహరించనుందని న్యూస్ వినిపిస్తోంది.
ప్రస్తుతం 'ది ఘోస్ట్' షూటింగ్ తో బిజీగా ఉన్న నాగార్జున బిగ్ బాస్-6 కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడని, అందుకే షో నిర్వాహకులు ఆయన ప్లేస్ లో హోస్ట్ గా సమంతను తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల బిగ్ బాస్-6 అనౌన్స్ మెంట్ వీడియో వచ్చింది. అందులో నాగార్జునే కనిపించాడు.