మెగా- అక్కినేని మల్టీస్టారర్!!
on Jul 24, 2021
మెగా-నందమూరి హీరోల మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ మూవీగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 న విడుదల కానుంది. ఇదిలా ఉంటే మరో టాలీవుడ్ మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది.
మెగా- అక్కినేని హీరోల మల్టీస్టారర్ రాబోతుంది అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇటీవల మెగా మేనల్లుడు సాయి తేజ్ ను కలిసి ఓ యంగ్ డైరెక్టర్ కథ వినిపించాడట. సాయి తేజ్ కు ఆ కథ నచ్చిందట. అయితే ఇది మల్టీస్టారర్ స్టోరీ అవడంతో మరో హీరోగా అఖిల్ లేదా నాగ చైతన్యలలో ఎవరైనా బాగుంటుందని సాయి తేజ్ సూచించాడట. దాంతో ఆ డైరెక్టర్ ఇప్పుడు ఆ కథని పట్టుకుని అక్కినేని హీరోల వద్దకి వెళ్ళాడని తెలుస్తోంది. అఖిల్, చైతూ లలో ఎవరు ఓకే అన్నా మెగా-అక్కినేని మల్టీస్టారర్ పట్టాలెక్కడం ఖాయం.
కాగా సాయి తేజ్ లేటెస్ట్ మూవీ 'రిపబ్లిక్'. దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
