ప్రముఖ దర్శకుడితో త్రిష పెళ్లి!!
on Jul 24, 2021
హీరోయిన్ త్రిష పెళ్లి టాపిక్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ తమిళ దర్శకుడిని త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఒక సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని, త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి త్రిష పెళ్లికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం త్రిషకు ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిందని న్యూస్ వినిపించింది. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని తేలింది. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ డైరెక్టర్ తో త్రిష్ ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రం తెలియరాలేదు.
కాగా, గతంలో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొన్న కారణాల వల్ల వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి సినిమాలపై దృష్టి పెట్టిన త్రిష.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం త్రిష 'పొన్నాయ్ సెల్వన్', 'సతురంగ వెట్టాయ్' తదితర చిత్రాలతో బిజీగా ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
