బన్నీతో సన్నీ చిందులు?
on Jul 24, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ - రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటేనే చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ కి కేరాఫ్ అడ్రస్. మరీముఖ్యంగా.. ఈ త్రయం కలయికలో వచ్చిన గత రెండు చిత్రాలు (ఆర్య, ఆర్య 2) కూడా ఐటమ్ సాంగ్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
కట్ చేస్తే.. తాజా సినిమా `పుష్ప`లోనూ ఆ పరంపరని కొనసాగించే పనిలో ఉన్నారు బన్నీ - సుక్కు - డీఎస్పీ త్రయం. రెండు భాగాలుగా రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం.. రెండు ఐటమ్ సాంగ్స్ డిజైన్ చేశారని టాక్. అంతేకాదు.. తొలి భాగంలో వచ్చే ఐటమ్ నంబర్ కోసం శృంగార తార సన్నీ లియోన్ ని నర్తింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట సుక్కు అండ్ టీమ్. `పుష్ప` పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. సన్నీకి ఉన్న పాన్ - ఇండియా ఇమేజ్ ప్లస్ అవుతుందనే ఆలోచనతోనే ఆమెతో సంప్రదింపులు జరిపారట. అంతేకాదు.. ఈ పాట కోసం సన్నీ లియోన్ రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందని, అందుకు మేకర్స్ కూడా సానుకూలంగానే స్పందించారని టాక్. త్వరలోనే `పుష్ప`లో సన్నీ స్పెషల్ సాంగ్ పై క్లారిటీ వస్తుంది.
మరి.. బన్నీతో కలిసి సన్నీ వేయనున్న ఈ చిందులు `పుష్ప`కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
