జూనియర్ ఎన్టీఆర్ కి కాజల్ గుడ్ బై..!
on Aug 5, 2014
జూనియర్ ఎన్టీఆర్ తో పూరి జగన్నాథ్ తీస్తున్న కొత్త చిత్రంలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎక్కువగా ఆఫర్లు లేక ఖాళీగా వున్న కాజల్ కి వెంటనే వచ్చిన అవకాశాలన్నిటికి ఓకే చెప్పేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లు వరుసగా స్టార్ట్ కావడంతో డెట్లు సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతుందట. పైగా పూరి తన సినిమా కోసం కాజల్ ను ఎక్కువ కాల్షీట్లు అడిగారట. దీంతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కాజల్ ప్లేస్లో మరో హీరోయిన్ని తీసుకుంటారా? లేక కాజల్ ఈషూటింగ్ కు అనుగుణంగా తన కాల్షీట్లు మార్చుకుంటుందా?అనేది త్వరలో తేలనుంది.