ఫ్యాన్స్ కి షాకిచ్చిన పవన్ కళ్యాణ్..!!
on Jul 29, 2014

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’సినిమా చేస్తారా, చేయరా అనే డౌట్స్ ఇండస్ట్రీలో మొదలైన సమయంలో ఆ సినిమా పూజా కార్యక్రమంతో వార్తలకు చెక్ పెట్టాడు పవన్. ఆతరువాత ఎన్నికల ప్రచారంలో బిజీగా వుండడంతో ఆలస్యం అయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ పాలిటిక్స్ నుంచి ఫ్రీ కూడా అయ్యాడు. గోపాల గోపాల చిత్రాన్నికి షూటింగ్ కూడా చేస్తున్నాడు. మరి ‘గబ్బర్‌సింగ్ 2’సినిమా ఏమైనట్టు!
.jpg)
లేటెస్ట్ గా ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఓ హాట్ న్యూస్ ప్రచారం చేస్తుంది. ‘గబ్బర్‌సింగ్ 2’ చేయకూడదని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చాలా కాలంగా గబ్బర్‌సింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమా ఆగిపోయిందని తెలియడంతో నిరుత్సాహపడ్డట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతకి మాత్రం పవన్ వేరే విధంగా హెల్ప్ చేస్తానని హామి ఇచ్చాడట. పవన్ కోసం రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న సంపత్ నంది మరిప్పుడు ఏం చేస్తాడో కానీ పవన్ ఫాన్స్ కి మాత్రం ఇది ఊహించని షాకే!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



