‘రన్ రాజా’ హిట్..ప్రభాస్ ఫుల్ ఖుషీ..!
on Aug 5, 2014

శర్వానంద్ నటించిన‘రన్ రాజా రన్’ హిట్ కావడంతో రెబెల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఖుషీగా వున్నాడు. తన డార్లింగ్ లకు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చాడు. అదేంటి ‘రన్ రాజా రన్’ హిట్టైతే ప్రభాస్ పార్టీ ఎందుకిచ్చాడు అనుకుంటున్నారా? ఇక్కడే వుంది అసలు విషయం..తన స్నేహితులు వంశీ, ప్రమోద్ లను నిర్మాతలుగా పరిచయం చేస్తూ ప్రభాస్ మిర్చి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆతరువాత ‘రన్ రాజా రన్’ ఆడియో ఫంక్షన్‌కి కూడా ప్రభాస్ హాజరయ్యాడు. ఇదంతా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఇక్కడే వుంది ఓ ట్విస్ట్. యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్‌కి కూడా భాగస్వామ్యం వుందని ఇండస్ర్టీలో ప్రచారం సాగుతోంది. అందుకే అంతా హడావుడి చేస్తున్నాడట. త్వరలో ఈ బ్యానర్‌పై స్మాల్ మూవీస్ చేయాలని ప్లాన్ కూడా చేశాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



