శ్రేయా భూపాల్‌కు ఎన్నారై సంబంధం..కుర్రాడి వివరాలు ఇవే
on Apr 7, 2017

కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కు, పారిశ్రామిక వేత్త జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. కాని ఏం జరిగిందో ఏంటో తెలియదు కాని, అనూహ్య కారణాలతో ఆ పెళ్లి రద్దు కావడం టాలీవుడ్‌ని ఆశ్చర్యపరిచింది. ఈ పెళ్లి ఫలానా కారణం వల్ల రద్దు అయ్యిందని అటు అక్కినేని ఫ్యామిలీ కాని..ఇటు జీవీకే ఫ్యామిలీ కాని అధికారికంగా ప్రకటించింది లేదు..మీడియాలో వస్తున్న రకరకాల కథనాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది లేదు. పెళ్లి క్యాన్సిల్ అయ్యాకా ఈ జంట మీడియా కంటపడలేదు. శ్రేయా అమెరికాకు, అఖిల్ గోవాకు వెళ్లినట్లు టాక్. అయితే శ్రేయాకి తన అంతస్థుకు తగ్గ మరో వరుడిని ఎంపిక చేశారంట జీవీకే..విదేశాల్లో సెటిల్ అయిన ఓ వ్యాపారవేత్త తనయుడితో శ్రేయా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నట్లు కుటుంబసభ్యులకు ఈ విషయంలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట శ్రేయా. త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



