వడివేలు తెలుగులో నటించిన ఏకైక సినిమా.. ఎవరు డబ్బింగ్ చెప్పారో తెలుసా!
on Sep 12, 2023

వడివేలు.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా సరే పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది. అంతలా.. తన హాస్యంతో నవ్విస్తారాయన. స్వతహాగా తమిళ నటుడైన వడివేలు.. 1988 నుంచి కోలీవుడ్ లో కమెడియన్ గా కొనసాగుతున్నారు. అంటే.. 35 ఏళ్ళ అభినయపర్వం వడివేలు సొంతం అన్నమాట. తెలుగులో మనకు బ్రహ్మానందం ఎలాగో.. అలా అక్కడివారికి వడివేలు కామెడీ కింగ్.
'ప్రేమికుడు', 'ప్రేమదేశం', 'ఒకే ఒక్కడు', 'చంద్రముఖి'.. ఇలా పలు తమిళ అనువాద చిత్రాలతో తెలుగువారికి ఎంతో చేరువయ్యారు వడివేలు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తెలుగులోనూ వడివేలు ఓ సినిమాలో నటించారు. అదే.. 'ఆరోప్రాణం'. వినీత్, సౌందర్య జంటగా వీరు కె దర్శకత్వంలో రూపొందిన ఈ 1997 నాటి రొమాంటిక్ డ్రామాలో.. కథానాయకుడి స్నేహితుడి పాత్రలో దర్శనమిచ్చారు వడివేలు. కాగా, వడివేలు పోషించిన పాత్రకి మరో ప్రముఖ హాస్య నటుడు అలీ డబ్బింగ్ చెప్పారు. అంటే.. ఒక రకంగా ఒకే పాత్రలో ఇద్దరు ప్రముఖ హాస్యనటులు ఎంటర్టైన్ చేశారన్నమాట.
ఇదిలా ఉంటే, వడివేలు తాజా చిత్రం 'చంద్రముఖి 2'.. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది.
(సెప్టెంబర్ 12.. వడివేలు పుట్టినరోజు సందర్భంగా..)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



