నాగ్ తో అమల ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా.. !
on Sep 12, 2023
.webp)
అటు రీల్ లైఫ్ లోనూ, ఇటు రియల్ లైఫ్ లోనూ.. కింగ్ నాగార్జున, అమల అక్కినేనిది సక్సెస్ ఫుల్ జోడీ. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ సినిమాలు చేసిన అమల.. తెలుగులో ఎక్కువగా నాగార్జున కాంబినేషన్ లోనే సినిమాలు చేశారు. ఇంకా చెప్పాలంటే.. అమల మొదటి తెలుగు చిత్రమే.. నాగ్ తో చేసిన సినిమా కావడం విశేషం.
నిజజీవితంలో భార్యాభర్తలైన నాగ్, అమల.. పెళ్ళికి ముందు అరడజను చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. 'కిరాయి దాదా' (1987)తో మొదలైన ఈ హిట్ పెయిర్ ప్రస్థానం.. ఆపై 'చినబాబు' (1988), 'శివ' (1989), 'ప్రేమ యుద్ధం' (1990), 'షివ' (హిందీ - 1990), 'నిర్ణయం' (1991) వరకు సాగింది. అంటే.. ఇద్దరు కలిసి ఆరు సినిమాల్లో సందడి చేశారన్నమాట. వీటిలో 'శివ' సంచలన విజయం సాధించగా.. 'కిరాయి దాదా', 'షివ' సూపర్ హిట్ అయ్యాయి. ఇక 'చినబాబు', 'నిర్ణయం' యావరేజ్ కాగా.. 'ప్రేమ యుద్ధం' మ్యూజికల్ గా మెప్పించింది. మరి.. భవిష్యత్ లోనూ ఈ కాంబినేషన్ లో సినిమాలు వస్తాయేమో చూడాలి.
(సెప్టెంబర్ 12.. అమల అక్కినేని పుట్టినరోజు సందర్భంగా..)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



