డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాప్ 11 హిట్స్.. వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి?
on Sep 28, 2023
కమర్షియల్ సినిమాకి సరికొత్త మార్గం చూపించిన దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. అత్యంత వేగంగా సినిమాలు పూర్తిచేసే నిర్దేశకుడిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. అలాంటి పూరీ జగన్నాథ్ కెరీర్ లో టాప్ 11 హిట్స్ గా నిలిచిన మూవీస్ ఏంటో చూద్దాం..
1. బద్రి: దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కిదే మొదటి సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రం 2000 వేసవిలో రిలీజై ఘనవిజయం సాధించింది. పూరికి శుభారంభాన్నిచ్చింది.
2. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం: మాస్ మహారాజా రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన తొలి చిత్రమిది. 2001లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ స్టేటస్ ని చూసింది.
3. ఇడియట్: కన్నడంలో తను రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ అప్పుకి రీమేక్ గా.. ఇడియట్ ని తెరకెక్కించారు పూరి. రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఈ సినిమా 2002లో సందడి చేసింది.
4. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి: రవితేజతో పూరీ జగన్ హ్యాట్రిక్ మూవీ.. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. 2003 వేసవిలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించింది.
5. శివమణి: కింగ్ నాగార్జునని సరికొత్తగా ఆవిష్కరించిన కాప్ డ్రామా ఇది. 2003లో తెరపైకి వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
6. పోకిరి: సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో మరపురాని చిత్రం పోకిరి. కాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2006 సమ్మర్ లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వార్తల్లో నిలిచింది.
7. దేశముదురు: తెలుగుతెరకి సిక్స్ ప్యాక్ ని పరిచయం చేసిన సినిమా దేశముదురు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడంలో పూరీ సక్సెస్ అయ్యారు. 2007 సంక్రాంతికి సందడి చేసిన దేశముదురు మంచి విజయం సాధించింది.
8. చిరుత: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ పూరీ జగన్నాథ్ తీర్చిదిద్దిన చిరుత.. 2007లో విడుదలై కాసుల వర్షం కురిపించింది.
9. బిజినెస్ మేన్: పోకిరి తరువాత మహేశ్ తో పూరీ తీసిన సినిమా బిజినెస్ మేన్. 2012 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో యువతపై మంచి ప్రభావం చూపింది. కమర్షియల్ గానూ మెప్పించింది.
10. టెంపర్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసిన కాప్ డ్రామా టెంపర్. 2015లో రిలీజైన ఈ సినిమా వాణిజ్యాత్మకంగానూ చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
11. ఇస్మార్ట్ శంకర్: డబుల్ దిమాక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పూరీ తెరకెక్కించిన ఈ కాప్ డ్రామా.. 2019లో జనం ముందు నిలిచింది.
(సెప్టెంబర్ 28.. పూరీ జగన్నాథ్ బర్త్ డే సందర్బంగా)

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
