గయ్యాళి అత్త సూర్యకాంతాన్ని రాళ్లతో కొట్టింది ఎవరు
on Sep 27, 2023
తెలుగు సినిమా రంగాన్ని హీరోలు,హీరోయిన్ లు ,దర్శకులే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఏలగలరు అందులోను ఒక ఆడ క్యారక్టర్ ఆర్టిస్ట్ కూడా ఏలగలదని నిరూపించిన అలనాటి నటీమణి సూర్యకాంతం.ఆ రోజుల్లో సూర్యకాంతం అనే ఒక్క పేరు చాలు జనాన్ని థియేటర్స్ కి క్యూ కట్టించేలా చేసేది .క్యూ కట్టించడమే కాదు జనం థియేటర్ నుంచి తమ ఇళ్ళకొచ్చాక కూడా తాను సినిమాలో పోషించిన క్యారక్టర్ ని జనం కొన్ని రోజుల పాటు గుర్తుంచుకునేలా చేసింది. పైగా సినిమాలో సూర్యకాంతం పోషించిన క్యారెక్టర్ ని తిట్టుకుంటూనే జనం తమ రోజు వారి దిన చర్యని పూర్తిచేసే వాళ్ళంటే సూర్యకాంతం రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.సూర్యకాంతం అనే పేరున్న ఆడపిల్లలకి పెళ్లిళ్లు కూడా అయ్యేవి కావు. అసలు ఆ రోజుల్లో తమ ఇళ్లల్లోని ఆడపిల్లలకి తల్లి తండ్రులు సూర్యకాంతం అనే పేరునే పెట్టేవాళ్ళు కాదు.పొరపాటున అప్పటికే సూర్యకాంతం అనే పేరు తమ పిల్లలకి ఉన్న ఆ పేరుని మర్చి వేరేపేరు పెట్టేవాళ్ళు.అఫ్ కోర్స్ నేటికీ ఏ ఆడపిల్లలకి సూర్యకాంతం అనే పేరుని పెట్టలేదంటే సూర్యకాంతం నటనకి ఉన్న శక్తీ ఎంతటిదో తెలుసుకోవచ్చు.మరి అంతటి నటీమణిని ఒక ఏరియాలో ని జనం రాళ్లు తీసుకొని కొట్టారనే విషయం ఎంతమందికి తెలుసు.
అవి సూర్యకాంతం అప్రహతీతంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు పోతున్న రోజులు. ఏ సినిమా రిలీజ్ అయినా అందులో సూర్యకాంతం ఉండవలసిందే .పెద్ద పెద్ద హీరోలు సైతం తమ సినిమా లో సూర్యకాంతం ఉంటే తమ సినిమా కి హెల్ప్ అవుతుందని తద్వారా తాము కూడా ప్రేక్షకులకి దగ్గర అవుతామని భావించి ఆయా చిత్ర నిర్మాతలతో సినిమాలో సూర్యకాంతం గారిని తీసుకోమని చెప్పే వాళ్ళు . కోడల్ని సూటిపోటిమాటలు అంటూ రాచి రంపాన పెట్టె పాత్రలో సూర్యకాంతం విజృభించి నటించేవాళ్ళు.అలాగే చాడీలు చెప్పి పచ్చని సంసారాలని విడగొట్టే పాత్రల్లో కూడా ఆవిడ వీరవిహారం చేసి నిజంగానే తాను అలా చేస్తుందనే భ్రమల్ని ప్రేక్షకులకి కలిగించే వాళ్ళు.ఒకసారి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం సూర్యకాంతం అవుట్ డోర్ లో భాగంగా ఒక విలేజ్ కి వెళ్ళింది. ఆ మూవీ లో హీరో అక్కినేని నాగేశ్వరావు. పలనా గ్రామంలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న జనం తండో పతండాలుగా ఆ గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న సూర్యకాంతాన్ని చూసి ఒక్కసారిగా కోపోద్రోక్తులయ్యి సూర్యకాంతాన్ని రాళ్లు తీసుకొని కొట్టారు. సూర్యకాంతంకి మాత్రం తనని ఎందుకు కొడుతున్నారో అర్ధం కాలేదు.అప్పుడు అక్కడే ఉన్న నాగేశ్వరరావు వాళ్ళని ఆపి ఎందుకు సూర్యకాంతాన్ని కొడుతున్నారని అడిగితే ఎంతో మంది ఆడవాళ్ళని ఏడిపించడమే కాకుండా ఎంతో మంది కాపురాలని కూల్చిందని చెప్పడం తో ఏఎన్ఆర్,సూర్యకాంతం ల తో సహా అక్కడున్న వాళ్లంతా షాక్ కి గురయ్యారు.ఆ తర్వాత అక్కినేని అక్కడున్న జనం తో సూర్యకాంతం కేవలం సినిమాలోనే తాను పోషించిన క్యారక్టర్ దృష్ట్యా అలా ప్రవర్తిస్తుందని నిజ జీవితం లో సూర్యకాంతం చాలా మంచిదని తన దగ్గరికొచ్చి ఎవరు ఏమి అడిగిన కాదనకుండా సహాయం చేస్తుందని అలాగే ఇంటి దగ్గర నుంచి రకాకల వంటకాలు వండుకొచ్చి యూనిట్ లోఉన్న అందరకి పెడుతుందని చెప్పటం తో జనం శాంతించి అక్కడనుంచి వెళ్లిపోయారు .అలాగే ఏఎన్ఆర్ ఆయన పక్కనే ఉన్న శాంత కుమారి గారిని చూపించి తాను సినిమాల్లో మాత్రమే తల్లి పాత్రలు వేస్తూ చాలా మంచిదానిలా కనపడుతుందని నిజానికి శాంతకుమారి పరమ గయ్యాళి అని సరదాగా చెప్పాడు . జనం తనని రాళ్లతో కొట్టినందుకు సూర్యకాంతం వాళ్ళని ఏమి అనకుండా నేను పోషించిన పాత్రలో ఎంతగానో లీనమయ్యి నటించాను కాబట్టే జనం నన్ను రాళ్లతో కొట్టారని తన నటనకి ఉన్న శక్తీ ఎంతో అర్ధం అయ్యిందని చెప్పి సూర్యకాంతం ఆనందం తో కన్నీళ్ళు పెట్టుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



