సల్మాన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్..టైగర్ 3 ట్రైలర్ రిలీజ్
on Oct 4, 2023

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఇప్పుడు రిలీజ్ కాబోయే సల్లు భాయ్ సినిమా ఏ సినిమా కి సంబంధించిన సీక్వెల్ అని ఆరా తీయాలసిన పరిస్థితి. వాళ్ళ అంచనాలకి తగ్గట్టే సల్లు భాయ్ తన లేటెస్ట్ సినిమా గా ఏక్ తా టైగర్,టైగర్ జిందా హై లకి సీక్వెల్ గా టైగర్ 3 విడుదలకి ముస్తాబు కాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని చిత్ర బృందం ప్రకటించింది.
సల్మాన్ ఖాన్ రెండున్నర దశాబ్దాల పై నుంచి తనకి మాత్రమే సాధ్యమైన నటనతో సినీ ప్రేక్షకులని ఎంతగానో రంజింప చేస్తున్నాడు. సల్మాన్ స్మైల్ కే ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. లవర్ బాయ్ గా, కుటుంబ కథానాయకుడుగా,యాక్షన్ హీరో గా విజృభించి నటించడం ఖాన్ భాయ్ స్పెషాలిటీ. తన ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. అలాగే ఆయా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు లు సృష్టించినవే. భాష తో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ ఆయనకీ అభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు సల్లు భాయ్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు.
ఇక సల్లు భాయ్ నుంచి లేటెస్ట్ గా టైగర్ 3 మూవీ రాబోతుంది. ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న టైగర్ కి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా ఆదిత్య చోప్రా నిర్మాతగా వహిస్తున్నారు.కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించిన ఒక బిగ్ అప్ డేట్ ని చిత్ర బృందం ప్రకటించింది.ఈ నెల 16 వ తేదీన టైగర్ 3 ట్రైలర్ రిలీజ్ కాబోతుందని ప్రకటించింది .దీంతో సల్మాన్ ఫాన్స్ అండ్ సినీ ప్రేమికులు టైగర్ 3 ట్రైలర్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు .300 కోట్ల వ్యయం తో టైగర్ 3 దీపావళికి విడుదల కాబోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



