పాకిస్థాన్ నటితో లవర్‌కి దొరికిపోయిన సల్మాన్ ఖాన్!
on Oct 4, 2023

తొంభయ్యవ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పాకిస్థాన్ కి చెందిన సోమి అలీ అనే హీరోయిన్ గురించి తెలియని వారు లేరు.తన అందంతో భారతీయ సినీ ప్రేక్షకులని కట్టి పడేసింది. దాదాపు బాలీవుడ్ కి చెందిన టాప్ హీరోలందరి సరసన నటించింది. తాను తాజాగా సల్మాన్ ఖాన్ గురించి చేసిన ఒక వ్యాఖ్య టోటల్ భారతీయ సినీ పరిశ్రమ మొత్తాన్ని సునామి కంటే ఎక్కువగా షేక్ చేస్తుంది. జన్మతః పాకిస్థాన్ కి చెందిన సోమి అలీ ఎన్నో హిందీ చిత్రాల్లో నటించి తన కంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకుంది. మిధున్ చక్రవర్తితో కృష్ణన్ అవతార్, తీస్ర కౌన్, సునీల్ శెట్టి సరసన అంత్,సైఫ్ అలీ ఖాన్ సరసన యార్ గద్దర్ ,ఆయా ప్యార్ కరెన్,గోవింద,సంజయ్ దత్ ల కాంబినేషన్ లో అందోళన్ సినిమా అలాగే ఇతర బిగ్ హీరోలతో అగ్నిచక్ర,మాఫియా చుప్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానులనుతో పాటు నటిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులని సంపాదించింది. అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆమె తాజాగా సల్మాన్ ఖాన్ ఖాన్ మీద అణుబాంబు కంటే శక్తివంతమైన పెద్ద బాంబునే పేల్చింది.
అసలు విషయంలోకి వస్తే ఒక ప్పుడు సల్మాన్ ఖాన్ ,ప్రముఖ నటి సంగీత బిజిలానీ లు ప్రేమించుకున్నారనే విషయం ఆ రోజుల్లో చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ విషయం గురించే సోమి అలీ మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. సల్మాన్, సంగీతలు ప్రేమలో ఉన్న రోజుల్లో సల్మాన్ తాను ఒక అపార్ట్మెంట్ లో ఉన్నామని సల్మాన్ ని పెళ్ళిచేసుకోవాలని సంగీత భావించిందని కానీ సల్మాన్ కి పెళ్లి ఇష్టం లేదని సోనీ చెప్పింది. అలాగే సల్మాన్ నేను ఒకే ప్లాట్ లో ఉండగా సంగీత అక్కడికి వచ్చి మా ఇద్దర్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకుందనే సంచలనం విషయాన్నీ కూడా వెల్లడించింది దీంతో సంగీత సల్మాన్ కి దూరమయ్యిందని చెప్పుకొచ్చింది. కాగా సల్మాన్ ,సోని కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యకపోవడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



