తనకి అరుదైన జబ్బు వచ్చిందంటున్న హీరోయిన్
on Oct 5, 2023

2016 వ సంవత్సరం లో వచ్చిన దంగల్ మూవీ లో అమీర్ ఖాన్ కూతురుగా బబితా కుమారి క్యారక్టర్ లో సూపర్ గా నటించి మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్థింపు తెచ్చుకున్న నటి సన్య మల్హోత్రా. అంతే కాకుండా దంగల్ మూవీ సాధించిన ఘన విజయంలో సన్య పాత్ర కూడా ఉందనటం లో ఎలాంటి సందేహం లేదు. చిన్న వయసులోనే అమీర్ లాంటి సీనియర్ యాక్టర్ ముందు ఎలాంటి బెదురు లేకుండా నటించి బాలీవుడ్ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకుంది. ఇండస్ట్రీ కి పరిచయమైన అతి కొద్దీ కాలం కొనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి లేటెస్ట్ గా జవాన్ సినిమాతో మంచి సక్సస్ ని అందుకున్న సన్య ఇప్పుడు తనంతట తానే నేను పలనా వ్యాధి బారిన పడ్డానని చెప్పి అందర్నీ షాక్ కి గురి చేసింది.
సినిమాల్లోకి రాక ముందు డాన్స్ ఇండియా డాన్స్ లాంటి ప్రోగ్రాం లో పాల్గొని మొదటి 100 మంది డాన్సర్లలో ఒకరిగా నిలిచినా సన్య ఆ తర్వాత టెలివిజన్ సెక్టార్ లో కూడా పని చేసి ఆ తర్వాత దంగల్ మూవీ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.తన మొదటి సినిమా నుంచే ఇంక తాను వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది బధహో,లుడో,పగ్గలైట్ ,శకుంతల దేవి,హిట్ ది ఫస్ట్ కేస్ పటాకా,ఫోటో గ్రాఫ్,లవ్ హాస్టల్,ది గ్రేట్ ఇండియన్ కిచన్, మీనాక్షి సుందేరేశ్వర్ ఇలా చెప్పుకుంటూ పోతే సన్య ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి ఒక మంచి నటిగ గుర్తింపుని తెచ్చకుంది. అలాగే సినిమాలో సన్య మల్హోత్రా ఉంటె తమ సినిమా హిట్ అనే నమ్మకం కూడా నిర్మాతలకి వచ్చింది.లేటెస్ట్ గా వచ్చిన కథల్ ,జవాన్ మూవీల్లో సూపర్ గా నటించి ప్రేక్షకులందర్నీ తన నటనతో కట్టిపడేసింది.ప్రస్తుతం తన నుంచి సామ్ బహదూర్ మూవీ ఒకటి డిసెంబర్ నెలలో విడుదలకి సిద్ధం అవుతుంది.
ఇంక అసలు విషయానికి వస్తే .సన్య తాజాగా తనకున్న ఆరోగ్య సమస్య గురించి చెప్పి తన అభిమానులని షాక్ కి గురి చేసింది. తాను కొన్ని నెలల నుంచి ఇంఫోస్టర్ సిండోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాని ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఆత్మనూన్యతాభావం ఏర్పడుతుందని చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్నానని కూడా చెప్పింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఎందుకంటే సన్య ఎన్నో మంచి మంచి పాత్రలతో బాలీవుడ్ మొత్తానికి ప్రీతిపాత్రమైన నటిగా గుర్తింపుని తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ మొత్తం సన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



