English | Telugu
ఫ్రూట్ నింజా టాస్క్ లో యావర్ విజేత.. సంఛాలక్ గా అమర్ దీప్ ఫెయిల్!
Updated : Oct 5, 2023
బిగ్ బాస్ హౌజ్ లో టాస్క్ లలో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ఇరగదీస్తున్నారు. అయితే మేం గ్రూప్ లుగా ఆడట్లేదంటూనే సీరియల్ బ్యాచ్ మరోసారి గ్రూప్ గా ఆడారు. ప్రతీసారీ , ప్రతీ టాస్క్ లో గ్రూప్ లుగా మాట్లాడుకుంటూ, బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవకుండా అన్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు.
శివాజీ-పల్లవి ప్రశాంత్ ప్రతీ టాస్క్ లో నీతిగా, నీజాయితీగా ఆడి గెలుద్దామని అనుకుంటున్నారు. కానీ ఈ సీరియల్ బ్యాచ్ చేసే పాలిటిక్స్ వల్ల వీరు రెండు, మూడు స్థానాలలో ఉంటున్నారు. అయితే శివాజీ-పల్లవి ప్రశాంత్ ల ఫెయిర్ ప్లే ప్రేక్షకులకు అర్థమవుతుంది. 'దొరికొతే దొంగ, దొరక్కపోతే దొర' టాస్క్ లో ఆట సందీప్- అమర్ దీప్ ఇద్దరు కలిసి అన్నీ తీసుకొద్దామని ముందే మాట్లాడుకున్నారు. అలాగే అన్నీ తెచ్చేశారు. దాంతో ఆ టాస్క్ లో సీరియల్ బ్యాచ్ అంతా ఓడిపోయింది.
ఇక ఆ తర్వాత 'ఫ్రూట్ నింజా' టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో బడ్డీస్ లోని ఒకరు లైన్ కి ఇవతల ఉండాలి, మరొకరు తలపై డబ్బా పెట్టుకొని జ్యూస్ టీపాయ్ దగ్గర ఉండాలి. ఇవతల ఉన్న వ్యక్తి లైన్ క్రాస్ చేయకుండా బత్తాయి విసిరితే, అవతల ఉన్న వ్యక్తి ఆ తల మీద ఉన్న డబ్బాలో పడేలా క్యాచ్ పట్టాలి. అలా పట్టిన తర్వాత జ్యూస్ తీయాలి. ఎవరెంత జ్యూస్ తీస్తారో వారే విజేత అని బిగ్ బాస్ ప్రకటించాడు.
అయితే టాస్క్ మొదలైన నుండి అమర్ దీప్ లైన్ క్రాస్ చేసి బత్తాయిలు విసిరాడు. ఆట సందీప్ వాటిని క్యాచ్ సారిగ్గా పట్టుకోలేకపోయాడు. అయితే ఆట సందీప్ జ్యూస్ తీసే టైమ్ లో ఆ బుట్టలో బత్తాయిలు కాకుండా పక్కన ఉన్న బత్తాయిలని తీసుకున్నాడు. దాంతో పాటు బత్తాయి తొక్కని కూడా అందులో వేశాడు ఆట సందీప్. ఇక అది గమనించిన పల్లవి ప్రశాంత్ కౌంట్ చేసేప్పుడు అందులో తొక్క తీయాలని చెప్పిన అమర్ దీప్ విని కూడా పట్టించుకోలేదు.
అతను సంఛాలక్ కాబట్టి అతని నిర్ణయమే సరైనదని, అతనేం చెప్పిన కరెక్ట్ అని, అతని చేతిలో పవర్ ఉందని భావించి.. మొదటి స్థానం యావర్-టేస్టీ తేజలకి ఇచ్చి రెండవ స్థానం ఆట సందీప్-అమర్ దీప్ కి ఇచ్చుకోగా, మూడవ స్థానం శివాజీ- పల్లవి ప్రశాంత్ లకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఇంత చీట్ చేసి ఆడిన శివాజీ-ప్రశాంత్ లు నింపిన జ్యూస్ కంటే ఒక్క మిల్లీ పాయింట్ మాత్రమే ఎక్కువ ఉన్నారు. అయితే ప్రిన్స్ యావర్ తన శక్తినంతా ఉపయోగించి అత్యధికంగా జ్యూస్ తీసి మొదటి స్థానంలో ఉన్నాడు. కన్నింగ్ సీరియల్ బ్యాచ్ పాలిటిక్స్ తో ఈ టాస్క్ లో రెండవ స్థానంలో ఉన్నారు. అయితే కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో అత్తధికంగా 5 స్టార్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు.