English | Telugu

మణికంఠ మగాడు కాదంటూ నీచంగా మాట్లడిన యష్మీ...


బిగ్ బాస్ చరిత్రలో ఓ మగాడి గురించి ఇంత నీచంగా మాట్లాడిన సందర్భం లేదు. బహుశా యష్మీ మాట్లాడిన మాటలే ఫస్ట్ టైమ్. మణికంఠని ఫిజికల్ గా వీక్ అంటూ యష్మీ ఎటాక్ చేస్తుంది. తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా మణికంఠని మాటలతో మానసికంగా ఇబ్బంది పెడుతుంది యష్మీ. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్ట్ ఎంట్రీలని ఆపడానికి కంటెస్టెంట్స్ కి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా హౌస్ లో ఉన్న రెండు క్లాన్ల సభ్యలు తమకి సాధ్యమైనంతగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇలా టాస్క్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. అలా నిన్న జరిగిన ఓ ఎపిసోడ్ లో మణికంఠని టార్గెట్ చేసి నిఖిల్, యష్మీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. మణికంఠ తనని ఓదార్చడంలో భాగంగా.. హగ్ చేసుకున్నాడని... పెద్ద డ్రామా క్రియేట్ చేసి తెగ ఫీల్ అయిపోయిన యష్మీ గౌడ.. అదే వ్యక్తిని మగాడే కాదంటూ నీఛంగా మాట్లాడింది. హౌస్ మొత్తం ఒక్క చోట కూర్చుని.. మణికంఠ మగతనం గురించి మాట్లాడి వాళ్ల క్యారెక్టర్‌లను బజారున పెట్టుకున్నారు. వీళ్లకంటే.. ఆ బజారున బతికేవాళ్లే నయం అన్నంత నీఛంగా మాట్లాడారు. అందరు కలిసి మణికంఠ మగతనంపై జోక్‌లు వేసుకుని నవ్వేశారు. అరెయ్ మణి అందరం ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కడివే అక్కడ కూర్చున్నావేంటి ఇక్కడికి రా అని నిఖిల్ అనగానే.. ఇక్కడ మగాళ్ళు మాత్రమే కూర్చుంటారని యష్మీ అంది. అంటే మణికంఠ మగాడు కాదని అంది. ఇలా అతడి క్యారెక్టర్ ని పదేపదే కించపరుస్తూ మాట్లాడుతుంది యష్మీ. మరి బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూపై స్పందించడం లేదో ఏమో. వీకెండ్‌లో నాగార్జున అయిన ఈ ఇష్యూ మీద హెచ్చరిస్తారో.. లేదంటో యష్మీకి ఆ ఫ్రీడమ్ ని అలాగే కంటిన్యూ చేయమంటారో చూడాలి మరి.

ఈ వారం మణికంఠ నామినేషన్ లో ఉన్నాడు‌. నబీల్ తర్వాత ప్రేరణ, మణికంఠ ఉన్నారు. యష్మీ మాటలకి మణికంఠకి బీభత్సమైన పాజిటివిటి పెరిగింది. మరి ఈ ఇష్యూ ఎలా ముగుస్తుందో చూడాలి.


Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.