English | Telugu

ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ నేరం కాదు


ఈ శుక్రవారం శనివారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో స్కిట్ ఒక్కోలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో రౌడీ రోహిణి బాగా నవ్వించింది. ఇందులో రోహిణి బెగ్గింగ్ రోల్ లో నటించింది. బెగ్గింగ్ కోచింగ్ సెంటర్ పెట్టి అందులో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ కోచింగ్ సెంటర్ కి ఆటో రాంప్రసాద్, దొరబాబు ఇద్దరూ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు. "మాకు జాబ్ లు ఇస్తామని చెప్పింది బెగ్గర్స్ గానేనా" అని ఆటో రాంప్రసాద్ అడిగేసరికి "అవును బెగ్గింగ్ కోసమే" అని చెప్పింది రోహిణి.

దానికి ఆటో రాంప్రసాద్ కొంచెం ఫీలైనట్టు కనిపించాడు. "చీప్ గా అడుక్కోవడం ఏంటండీ దరిద్రంగా " అని అడిగేశాడు రాంప్రసాద్. "చీప్ గా అడుక్కోవడం ఏమిటి " అని అడిగాడు. "చీప్ గా అడుక్కోవడమా ...ఏమనుకుంటున్నావ్. ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ కాదు" అని చెప్పింది రౌడీ రోహిణి. ఇక రోహిణి అడుక్కునే అమ్మాయి రోల్ లో బాగా నటించింది. దీంతో జడ్జెస్ ఐతే ఫుల్ జోష్ తో నవ్వేశారు. దాంతో శాంతి, రోహిణి ఇద్దరూ కలిసి జడ్జెస్ దగ్గరకి వెళ్లేసరికి వాళ్ళు ఒకరికి 10 , ఇంకొకరికి 8 మార్కులు వేశారు. ఇలా ఈ వారం జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.